ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖీరీ ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాక సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడి ఆశిష్ మిశ్రాపై మర్డర్ కేసు నమోదైంది. ఆశిష్ మిశ్రాతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, ఆయన కుమారుడిపై రైతులు లఖింపురి ఖీరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లడంతో నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఈ ఘటనను కాంగ్రెస్ సహా ప్రధాన ప్రతిపక్షాలు ఖండించాయి. అయితే ఈ ఘటనతో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి అజయ్ మిశ్రా పేర్కొన్నారు. కొంతమంది ఆందోళనకారులు కత్తులు, కర్రలతో దాడి చేశారని, ఆ సమయంలో అక్కడ తన కుమారుడు ఉండి ఉంటే సజీవంగా వచ్చేవాడు కాదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.