హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ రోజు రోజుకూ బలం పుంజుకుంటుంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో వివిధ పార్టీల నుంచి ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో హుజూరాబాద్‌లోని రాధాస్వామి సత్సంగ్ ఆశ్రమంలో 19, 22, 27 వార్డులకు చెందిన పలువురు బీజేపీ కార్యర్తలు టీఆర్ఎస్లో చేరారు.
అక్కడ ప్రత్యేక సమావేశం నిర్వహించారు మంత్రి గంగుల. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన వారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.