బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం చూస్తుండగానే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. 19 మంది కంటెస్టెంట్స్‌తో సీజన్ 5 మొదలు కాగా, షో నుండి నలుగురు ఎలిమినేట్ అయ్యారు. తొలివారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగోవారం నటరాజ్ మాస్టర్ బయటకు వచ్చేశారు.
సండే ఫండ్డే కావడంతో హౌజ్‌మేట్స్ సందడి చాలా కనిపించింది. ముఖ్యంగా నిన్నే పెళ్లాడుతా సినిమా వచ్చి 25 ఏళ్లు అవుతుండటంతో హౌజ్‌మేట్స్ స్పెషల్ పర్ఫామెన్స్‌లు చేసి అలరించారు. గ్రీకు వీరుడు, ఎటో వెళ్లిపోయింది మనసు అంటూ పాటలకు కంటెస్టెంట్లు స్టెప్పులు వేశారు.వారి పర్ఫార్మెన్స్లకు ఇంప్రెస్ అయిన నాగ్ తన కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని చెప్పాడు.
ఇక హౌజ్‌మేట్స్‌తో సరదా గేమ్ ఆడించాడు. సభ్యులను రెండు టీమ్స్‌గా విడగొట్టగా, శ్రీరామ్, నటరాజ్, యానీ, ప్రియ, మానస్, జెస్సీ, సిరి, రవి టీమ్ ఏలో ఉండగా, మిగతావారు బీ టీమ్‌లో ఉన్నారు. విశ్వ, ప్రియాంక సింగ్‌లు రెచ్చిపోయారు. ఇక విశ్వ అయితే తన బాడీని చూపించేసి రచ్చ చేశాడు. అయితే విశ్వ, ప్రియాంక డ్యాన్స్ చేస్తున్నంత సేపు నేను మానస్‌ను చూస్తున్నాను అంటూ నాగార్జున పంచ్ వేశారు.