నాగచైతన్య, సమంత తమ వివాహబంధానికి విడాకులతో ఫుల్‌స్టాఫ్ పెట్టబోతున్నారని కొద్దిరోజులుగా నడుస్తున్న హాట్ టాపిక్‌కు శనివారం నాడు ఫుల్‌స్టాప్ పడిన విషయం విదితమే. ఎట్టకేలకు అక్కినేని నాగచైతన్య–సమంతతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేసేశారు. అలాగే సమంత కూడా ఇదే విషయాన్ని పోస్ట్ చేశారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఇరువురు వెల్లడించారు.
అయితే.. చక్కని జంట నాగచైతన్య, సమంత ప్రేమలో పడతారని ఎవరూ ఊహించలేదు.. అంతేకాదు.. ప్రేమలో పడ్డాక పెళ్లి పీటలు ఎక్కుతారని.. ఆ పెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటవుతుందని కూడా ఎవరూ అనుకోలేదు!.. ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు జనాలు గ్రహించలేదు గానీ.. విడిపోతారన్న విషయాన్ని మాత్రం ముందుగానే పసిగట్టారు!. ఆ ఊహాగానాలే నిజమయ్యాయి.
నాగచైతన్య, సమంత విడిపోతున్నట్టు ప్రకటించారు.అయితే.. నాగచైతన్య, సమంత విడాకులతో పాటు ‘భరణం ఎంత?’ అనేది ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇటు అక్కినేని, అటు దగ్గుబాటి కుటుంబాల నుంచి చైతన్యకు వారసత్వంగా ఆస్తి వచ్చింది. ఒక్కో సినిమాకూ కోట్లలో పారితోషికం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సమంతకు 100 నుంచి 200 కోట్ల రూపాయలు భరణంగా వస్తుందనేది వెబ్ మీడియా సారాంశం.