ఏబీవీపీ మాజీ జిల్లా కన్వీనర్ ఆవుల తిరుపతి ఆదివారం హుజురాబాద్ మండలం సింగాపురంలో ఆర్థిక మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. మంత్రి హరీష్ రావు తిరుపతికి గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా తిరుపతి విలేకరులతో మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా కాషాయ సిద్ధాంతం కోసం పని చేస్తున్న సందర్భంలో ఈటల రాజేందర్ అనేకసార్లు అక్రమ కేసులు అక్రమ అరెస్టు తమపై పెట్టి అరెస్ట్ చేయించారని ఆరోపించారు.
ఈటల రాజేందర్ సిద్ధాంతాలు లేని వ్యక్తి అని, ఆయనకు నైతిక విలువలు ఏమాత్రం లేవని.. అయన నకకత్వంలో పని చేయడం తమకు ఇష్టం లేదని.. అయన తన వ్యక్తిగత స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి పొందేందుకు మాత్రమే ఈరోజు భారతీయ జనతా పార్టీ లో చేరడం జరిగిందన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా నిలుస్తోందని, దీనికి కారణం సి ఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ అని, అభివృద్ధికి ఆకర్షితులమై టీఆరెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని ఆవుల తిరుపతి స్పష్టం చేసారు.
దేవాలయ భూములను కబ్జా చేసిన దగాకోరు, ఈటల రాజేందర్ అని, ఇలాంటి నాయకుడిని కాషాయ సిద్ధాంతంలో చేర్చుకుని జనంలోకి పోవడానికి బిజెపి నాయకులు నాయకులు సిగ్గుపడాలని, పార్టీ సిద్ధాంతంలో కాకుండా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఈటల రాజకీయం చేస్తున్నారని, కాంగ్రెస్, బిజెపి పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం, కుమ్మక్కు కావడం దారుణమని,దీని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. విద్యార్ధి సంఘం నాయకునిగా ఉంది ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. పేదరికంలో ఉండి అనేక ఉద్యమాలు చేసి అనేక కేసులు భరించి తెలంగాణ రాష్ట్ర సాధనలో అలు పెరుగని పోరాటం చేసిన నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి నాయకుని గెలిపించుకునేందుకు కృషి చేస్తామని, కబ్జా అయిన ఈటల రాజేందర్ ను రాజకీయ సన్యాసం తీసుకునే వరకు పోరాటం చేస్తామని, ప్రజల్లోకి వెళ్లి ఈటల నిజస్వరూపం గురించి వివరిస్తామని, టీఆరెస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు వివరిస్తామని తిరుపతి యాదవ్ తెలిపారు.