ఓడిపొతున్న అనే ప్రస్టేషన్ లో మాటలు అదుపు తప్పుతున్నయ్.. నీ నోటినుండి అబద్దాలు ఎగిరిదుంకుతున్నయ్..?అహంకారం నీ నరనరాన కనబడుతుంది..?
నువ్వు ఓ బ్రేకులు ఫెయిల్ అయిన ఎర్ర బస్సు లెక్క నువ్వు ఎటుపోతున్నావో,ఎం మాట్లాడుతున్నావో నీకె అర్థం అవ్వట్లేదు..
ఒక తల్లి తన కొడుకు దూరమైన ఆవేదనతో మాట్లాడితే పైసలిచ్చి కొన్నారంటావా…? ప్రవీణ్ యాదవ్ తల్లి నువ్వు చేసిన తప్పుకు శాపనార్థాలు పెడితే ఆమెకు డబ్బులిచ్చారు అంటావా…?
ఆత్మగౌరవం గురించి మాట్లాడే రాజేందర్ ప్రపంచంలో తల్లి ప్రేమను డబ్బులతో కొనగలమా…?
ఆ తల్లి ఆవేదన నీకు హాస్యంగా కనపడుతుందా…?
ఇదేనా నువ్వు మాట్లాడే మాటలు..!!
పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నది ఎవరు రాజేందర్ గారు…?
యాట పోతులు,మందు బాటిళ్లు ఇచ్చి జనాలను ఆగం చేస్తుంది నువ్వు కాదా…?
కడియరాలు,గ్రైండర్లు,కుట్టు మిషిన్లు, బొట్టు పిల్లలు ఇచ్చి ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తుంది నువ్వు కాదా..?
నువ్వన్నట్టు కన్నీళ్లు పెట్టడం నిజంగానే ఈటెల రాజేందర్ కు రాదు..జనాలను కన్నీళ్లు పెట్టించడం మాత్రం పక్కా వచ్చు..
నువ్వు ఉన్నదే అబద్ధాల పార్టీలో బీజేపీ అంటేనే ఫెక్,డ్రామాల పార్టీ అలాంటి పార్టీలో నువ్వు ఉండి నీతులు చెప్తే ఎలా..?
కేసీఆర్ పై నిప్పులు చేరుగుతా అంటున్నావు బాగా చేరగకు నువ్వే కాలిపోతావ్..!!
రాజేందర్ అనే వాడు లొంగిపోతాడా అంటున్నావు కదా మరి బీజేపీ ఢిల్లీ బాసుల దగ్గర బానిసలా ఎందుకు నిలుచున్నావ్…?
ని స్వార్థం కోసం హుజరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో ఎందుకు తాకట్టుపెట్టావ్..?
నేడు నువ్వున్న ఈ స్థానం కేసీఆర్ పెట్టిన భిక్ష…తండ్రిలాంటి కేసీఆర్ కు గోరి కడతానని…జీవితం ఇచ్చిన టిఆర్ఎస్ ను నామరూపాలు లేకుండా చేస్తానని అంటున్నావు ఇదేనా ని ఆత్మగౌరవం…?
ఇదేనా నీకున్న సంస్కారం…?
అన్నం పెట్టినోనికి సున్నం పెట్టడమేనా నువ్వు నేర్చుకున్న నీతి..?
– నాలుగు ఓట్లుంటే స్కూటీ ఇచ్చేస్తున్నావట కదా అన్న..ఎన్ని ఇచ్చినా జనం నిన్ను నమ్మేలా లేరు రాజేందరన్నా..
నీ స్వంత ప్రయోజనాలు చూసుకున్నావ్ గాని ఎప్పుడైనా ని నియోజకవర్గాన్ని పట్టించుకున్నవా…?
హుజరాబాద్ ప్రజలు నీకు సరైన బుద్ది చెప్పబోతున్నారు…ఇదే నీకు ఆఖరి ఎన్నిక…నీకు రిటైర్మెంట్ తప్పదు రాజేందరన్న..
– Telangana vijay