Home / SLIDER / నీతి లేని ఈటల.. రీతి లేని రాజేందర్‌

నీతి లేని ఈటల.. రీతి లేని రాజేందర్‌

బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు నీతి లేదు.. జాతిలేదు.. రీతి లేదని ఆర్థికమంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘సీఎం కేసీఆర్‌పై ఈటల చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం భీంపల్లిలో నిర్వహించిన ధూంధాంలో ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్‌గా కూడా గెలువని ఈటల రాజేందర్‌కు ఆరుసార్లు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి.. రెండుసార్లు మంత్రిని చేసిన సీఎం కేసీఆర్‌ను దూషించటం నీకు తగునా అని ప్రశ్నించారు. ‘ఈటల నా కుడిభుజం, నా తమ్ముడు అని చెప్పిన కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావ్‌.. రాజకీయ భిక్షపెట్టిన వ్యక్తిని ఆ మాటలు అనవచ్చా రాజేందర్‌?’ అని నిలదీశారు. రైతు వ్యతిరేక చట్టాలు చేసిందని, రైతులకు అన్యాయం చేసిందని నాడు మాట్లాడి.. నేడు బీజేపీలో చేరిన ఈటలకే నీతిలేదు.. జాతిలేదు.. రీతి లేదు’ అని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం తెలంగాణకు వ్యాక్సిన్‌ ఇవ్వడం లేదు, కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఆరోగ్యమంత్రిగా ఉండి అన్న మాటలు ప్రజలు మరిచిపోతారా? అని నిలదీశారు. పుట్టుకతోనే లెఫ్టిస్టును అని చెప్పుకున్న ఆయన ఏ సిద్ధాంతంతో బీజేపీలో చేరాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘నీకు నీతి లేదు.. నువ్వు చేరిన బీజేపీకి నీతి లేదు’ అని చెప్పారు. కేంద్రం నల్లచట్టాలు రద్దు చేసిందా? వంటగ్యాస్‌ సిలిండర్‌పై సబ్సిడీని రద్దు చేసిందా? లేదా? అని చెప్పి ఓట్లు అడగాలని సవాల్‌ విసిరారు.

ముసలవ్వను అడుగు సీఎం కేసీఆర్‌ మానవత్వమేంటో..
కేసీఆర్‌ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్ష చేసిన పోరాటయోధుడికి మానవత్వం లేదని మాట్లాడుతావా? అని మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. రెండు వేల పింఛన్‌ తీసుకుంటున్న ముసలవ్వను అడుగు.. రైతుబంధు తీసుకుంటున్న రైతును అడుగు.. ప్రభుత్వ దవాఖానలో కాన్పు చేసుకున్న చెల్లెమ్మను అడుగు కేసీఆర్‌ మానవత్వమేంటో తెలుస్తది అని చెప్పారు. పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాలుగువేల ఇండ్లు ఇస్తే ఒక్కటి కూడా కట్టియ్యకపోతివంటూ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడే పనులు చేయని ఈటల రాజేందర్‌.. రేపు ప్రతిపక్షంలో ఏం పనులు చేస్తడో ప్రజలు ఆలోచించాలని సూచించారు. గెల్లు శ్రీనివాస్‌.. గెలుపు శ్రీనివాస్‌ అని.. ఆయనను గెలిపిస్తే ఐదు వేల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టించే బాధ్యత తన దంటూ భరోసా ఇచ్చారు. లాస్య అనే చిన్నారి గురిగిలో దాచుకున్న డబ్బులను మంత్రి హరీశ్‌రావు సమక్షంలో గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ఎన్నికల ఖర్చుకోసం అందజేసింది.

దుమ్ము రేపిన ధూంధాం
భీంపల్లి ధూంధాంలో కళాకారుల ఆటపాటలు అలరించాయి. మహిళలు పెద్దఎత్తున బతుకమ్మలు, కోలాటాలు, డప్పు చప్పుళ్లతో మంత్రి హరీశ్‌రావు, విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు స్వాగతం పలికారు. గ్రామస్థులందరూ కార్యక్రమానికి తరలివచ్చారు. కళాకారుడు సాయిచంద్‌ పాడిన పాటలకు ప్రజలు నృత్యాలు చేశారు. అనంతరం పలు గ్రామాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో మాజీమంత్రి ఈ పెద్దిరెడ్డి, సర్పంచ్‌ జవ్వాజి పద్మ తదితరులు పాల్గొన్నారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat