హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ సమర్పించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కొప్పల ఈశ్వర్ సహా 20 మందిని స్టార్ క్యాంపెయినర్స్‌గా పరిగణించాలని ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ జాబితాను సమర్పించింది.
మంత్రి గంగుల కమలాకర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్, సుంకె రవిశంకర్, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, సండ్ర వెంకటవీరయ్య, దాసరి మనోహర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డిని స్టార్ క్యాంపెయినర్స్‌గా పరిగణించి అందుకు అవసరమైన వాహన పాస్‌లు జారీచేయాలని టీఆర్ఎస్ ఎన్నికల సంఘాన్ని కోరింది.