తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. శాసనసభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన నాడు దేశం యొక్క జీడీపీలో మన రాష్ట్రం యొక్క జీఎస్‌డీపీ శాతం 4.06గా ఉండేంది.
అయితే గత ఏడు సంవత్సరాల వరుస పెరుగుదలతో దేశం యొక్క జీడీపీలో మన రాష్ట్రం వాటా 4.97 శాతం పెరిగిందన్నారు. దేశం యొక్క ప్రగతి రేటు కంటే మన ప్రగతి రేటు ఎక్కువగా ఉంది. దేశ వృద్ధికి కూడా తెలంగాణ రాష్ట్రం తోడ్పాటును అందిస్తుంది. దేశంలోనే తెలంగాణ అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసింది.
ప్రాథమిక రంగంలో రాష్ట్రం పురోగతి సాధించినట్లు నీతిఆయోగ్ చెప్పింది. సాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం. రైతుబంధు, రైతుబీమా, రైతులకు రుణమాఫీ అమలు చేస్తున్నాం. గొర్రెలు, గేదెల పంపిణీ, డెయిరీ పరిశ్రమను అభివృద్ధి చేస్తున్నాం. వ్యవసాయ, అనుబంధం రంగాలపై ఏడేళ్లలో రూ.2.5 లక్షల కోట్లు ఖర్చు చేశాం. ఆర్థిక సంఘం సిఫార్సులను పట్టించుకోకుండా కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసింది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.