రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని కాలాలపాటు దేశానికి సేవలు అందించేలా రాష్ట్రపతికి భగవంతుడు ఆయురారోగ్యాలు, శక్తిని అందించాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.
