వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. అక్రమాస్తుల పరిరక్షణ కోసం.. కేసుల నుండి తప్పించుకోవడానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలోకి చేరిన సంగతి విధితమే. మంత్రిగా.. ఎమ్మెల్యేగా ఉండి అధికారాన్ని పదవులను అడ్డుపెట్టుకుని సంపాదించిన అక్రమాస్తులు ..చేసిన భూదందాలు.. ఒక్కొక్కటి వెలుగులోకి రావడంతో గత్యంతరం లేక టీఆర్ఎస్ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజురాబాద్ నియోజకవర్గానికి ఈ నెల ముప్పై తారీఖున ఉప ఎన్నికలు జరగనున్నాయి..
ఈ ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్న అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం గులాబీ శ్రేణులు నియోజకవర్గం అంతటా ఇప్పటికే జల్లెడ పట్టి మరి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఒకవైపు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పలు సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించి నియోజకవర్గ ప్రజల మదిని గెలుపొందింది టీఆర్ఎస్ పార్టీ. ఈ నెల ముప్పైన జరగనున్న ఉప ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయడం ఖాయం అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు…
మరోవైపు ఈటల రాజేందర్ కు మొదట్లో సపోర్టుగా ఉండి ఆ తర్వాత చేతులెత్తేశారు కమలం నేతలు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి చేరితే నీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం.. నీ వెనక మేమంతా ఉంటామని మాటలు చెప్పిన కమలం పార్టీ రాష్ట్ర అధినేత బండి సంజయ్ ,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,ఎంపీలు ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు,రాజా సింగ్ ,మాజీ మంత్రి డీకే అరుణ ,మాజీ ఎంపీ జితెందర్ రెడ్డి క్రమక్రమంగా హ్యాండ్ ఇస్తూ వచ్చారు.. ఒకపక్క అధికార టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ సామాన్య కార్యకర్త నుండి ఏకంగా మంత్రుల వరకు అందరూ గడపగడపకెళ్ళి తమ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే ఈటల తరపున మాత్రం ఈటలతో పాటు బీజేపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి,మాజీ జెడ్పీ చైర్ పర్శన తుల ఉమ తదితరులు తప్పా ఎవరు ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి నియోజకవర్గం ముఖం వైపు కూడా చూడకపోవడం ఆ పార్టీ నేతలే ఈటలను నమ్మించి మోసం చేశారు.
అయిన కన్నతల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీకి.. అన్న లాంటి కేసీఆర్ కు ఈటల పొడిచిన వెన్నుపోటు ముందు.. చేసిన మోసం ముందు ఇది ఎంత అని నియోజకవర్గ ప్రజలు ఈటలను చీదరించుకుంటున్నారు. సో కత్తి పట్టినోడు కత్తిపోటుకు.. మోసం చేసినోడు మోసానికి బలికావడం విధి రాత అన్నమాట,.. ఉన్నమాట ..