నిన్న బుధవారం అర్ధరాత్రి పోసాని కృష్ణమురళి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ దాడి ఘటనపై పోసాని స్పందించారు.పవన్ కల్యాణ్ లాంటి ఆవేశపరులు రాజకీయాలకు పనికిరారని అన్నాడు.ఆర్టిస్ట్‌గా ఉన్నప్పటి నుండి అలానే ఉన్నాడు. సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్ర షూటింగ్లో కో డైరెక్టర్ ఏదో తప్పు చేశాడని కొట్టాడు. అతని తప్పు లేదని తెలిసిన కూడా సారీ చెప్పలేదు.
నాకు ఎవరితో శృతత్వం లేదు. 35 ఏళ్ల నుండి సినిమా పరిశ్రమలో ఉన్నా. ఎవరితో గొడవపడలేదు. షూటింగ్ కి టైంకి వెళతా. అతడిని ప్రశ్నించా కాబట్టి అతను నాకు శతృవుగా మారాడు. నేను ఇలాంటి సన్నాసులని చాలా మందిని చూశాం. 1981 నుండి రాజకీయాల్లో ఉన్నా. ఇలా బెదిరించడాలు చాలా చూశా. రాళ్లకు, దెబ్బలకు భయపడను. పవన్ కళ్యాణ్‌ని నేను ఒక్కడినే చెప్పుతో కొడతాను. మహా అయితే నన్ను చంపుతారేమో. ఫ్యాన్స్‌కి డబ్బులు ఇచ్చి పంపడం ఏంటి? రాజకీయాలకి నా ఫ్యామిలీకి ఏంటి సంబంధం అంటూ పోసాని పవన్‌పై నిప్పులు చెరిగారు.