హైదరాబాద్లోని ఫిలిం నగర్లో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. కిరణ్ అనే యువకుడు అనురాధ (జూనియర్ ఆర్టిస్ట్) ను గత కొంతకాలం నుంచి ప్రేమిస్తున్నాడు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో ఏడాది నుంచి సహజీవనం చేస్తున్నాడు. అనురాధకు తెలియకుండా మరో యువతితో కిరణ్ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నాడు.
ఈ విషయం అనురాధకు తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి సోదరి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.