కొంత మంది చరిత్ర సృష్టించడానికి జన్మిస్తారు..మరికొంత మంది చరిత్రలో తమ పేరును లిఖించుకోవడానికి జన్మిస్తారు..కానీ చాలా చాలా తక్కువమంది మాత్రమే తామే ఒక చరిత్ర అవ్వడానికి జన్మిస్తారు..ఇలాంటి రకానికి చెందిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ సాధనలో జరిగిన దాదాపు పద్నాలుగేళ్ల పోరాటంలో ఎవరు చేయని విధంగా ప్రత్యర్థులకు సైతం అంతుపట్టని వ్యూహ రచనలతో నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై ఏండ్ల కలను సాకారం చేసి తానే ఒక చరిత్ర సృష్టించారు నేటి సీఎం నాటి ఉద్యమ దళపతి కేసీఆర్…
మలిదశ ఉద్యమంలో కావచ్చు తెలంగాణ ఏర్పడిన ఈ ఏడేండ్లలో కావచ్చు ఏ ఎన్నిక జరిగిన కానీ శత్రువులకు ఆర్ధం కానీ ప్రణాళికలతో ప్రతి ఎన్నికల్లో..ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించేలా పక్కా వ్యూహారచనలను..ప్రణాళికలను అమలు చేసి తానేంటో చాటుకున్నారు..చాటుకుంటున్నారు కేసీఆర్ …
తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లోనూ తన మార్కును ప్రదర్శించారు కేసీఆర్.. ఇటీవల దేశంలో ఉన్న పలు అసెంబ్లీ,పార్లమెంటు నియోజకవర్గ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను వాయిదా వేసిన సంగతి అందరికి తెల్సిందే.. ఆ సమయంలో తెలంగాణ బీజేపీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర నుండి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ వరకు ఆ పార్టీ నేతలంతా ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ ఉప ఎన్నికలు వాయిదా వేయించడానికి ఢిల్లీకెళ్లారు అని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేయదు..అదోక స్వతంత్రంగా పని చేసే సంస్థ అని తెల్సి కూడా విమర్శల వర్షం కురిపించి తెలంగాణ సమాజం దృష్టిలో నవ్వులపాలయ్యారు.. తాజాగా ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన హుజురాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ సందర్భంగా సీఎం కేసీఆర్ ఈరోజు కూడా ఢిల్లీలోనే ఉన్నారు…దీనిపై విశ్లేషకులు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్,బీజేపీ లకు చెందిన నేతలు గతంలో ఉప ఎన్నికలు వాయిదా పడినప్పుడు కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు..ఈరోజు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయంలో కూడా కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు.. అది కేసీఆర్ అంటే..కేసీఆర్ లా ప్రత్యర్థి పార్టీల నేతలు ఆలోచించాలంటే ఆయనలా చక్రం తిప్పాలంటే మళ్లీ ఇంకో జన్మనెత్తాలి..అప్పుడు కూడా ఆయనలా ఆలోచిస్తారు..ఆయన ఢిల్లీలో చక్రం తిప్పుతారనే నమ్మకం ఉండదని విశ్లేషిస్తున్నారు…