Home / SLIDER / అడుగడుగున ఈటలకు నిరసనల పర్వం…

అడుగడుగున ఈటలకు నిరసనల పర్వం…

మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్ కు హుజురాబాద్ నియోజకవర్గంలోని ఎదురుగాలి వీస్తుందా…?. ఆత్మగౌరవ నినాదంతో ఉప ఎన్నికలకు పోతున్న ఈటలకు తలెత్తుకోకుండా పలు అవమానకర సంఘటనలు ఎదురవుతున్నాయా..?. మీ బిడ్డను..మీకండ్ల ముందు ఎదిగిన వాడ్ని అని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ ను హుజురాబాద్ ప్రజలు చీదరించుకుంటున్నారా..? అంటే ఉప ఎన్నికల ప్రచారంలో ఈటల రాజ్ందర్ కు ఎదురవుతున్న అనుభవాలను చూస్తుంటే ఎవరైన అవుననే అనక తప్పకమానడంలేదు..

గత కొన్ని రోజులుగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో పలు వర్గాల ప్రజల నుండి అవమానకర పరిస్థితులు ఎదురవుతున్నాయి.. ఇప్పటిదాక సొంత ఇలాఖా అని తెగ జబ్బలు చరుచుకుంటున్న ఈటల రాజేందర్ కు ఎస్సీ సామాజికవర్గం నుండి ఊహించని అనుభవం ఎదురైంది.. ఆ అనుభవం గురించి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ” నేను ఎన్నికల ప్రచారానికి వస్తే గంట సేపు ఎదురు చూసిన కానీ డప్పులు కొట్టడానికి దళితులు రాలేదు..ఎస్సీల గురించి సీఎం కేసీఆర్ అమలు చేసిన దళితబంధు కార్యక్రమం వాళ్ల జీవితాలను బాగుచేశాయని అనడం” ఈటల పట్ల దళితులకు ఎలాంటి అభిప్రాయం ఉందో ఆర్ధమవుతుంది అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు..

తాజాగా నిన్న మంగళవారం ప్రవీణ్ యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన ఈటల రాజేందర్ కు ఎవరూ ఊహించని అనుభవం..ఘోర పరాభవం ఎదురైంది..పెద్దపాపయ్యపల్లిలోని ప్రవీణ్ యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికెళ్లారు ఈటల రాజేందర్.. ఆ సమయంలో ఈటల కు ఘోర పరాభవం ఎదురైంది..

ఈటలపై ప్రవీణ్ యాదవ్ కుటుంబ సభ్యులు దుమ్మెత్తిపోయడం ఈటల తలెత్తుకోలేకపోయాడని అక్కడున్న ప్రజలు గుసగుసలాడుకున్నారు..ఈ క్రమంలో తమ కుమారుని మృతికి నువ్వే కారణమంటూ అగ్రహాం వ్యక్తం చేస్తూ నీ వేధింపుల వల్లే ప్రవీణ్ యాదవ్ మృతి చెందాడని గ ఆరోపించారు…..దీంతో తల దించుకోని పోవడం ఈటల రాజేందర్ వంతైంది.ఇలా ప్రతిచోట ఈటలకు ప్రజల నుండి ఘోర అవమానాలు..చీదరింపులే ఎదురవుతున్నాయి..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat