మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఉప ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది నిరాశలో కృంగిపోతున్నారా…?. మొదట్లో తనలో ఉన్న జోష్ క్రమక్రమంగా తగ్గిపోతుందా..?. ఉప ఎన్నికల్లో గెలుపుపై తనకే నమ్మకం లేదా..? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే చెప్పాలి.
టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకముందు ప్రస్తుతం తాను చేరిన బీజేపీకి చెందిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరకు చెప్పిన మాటలు.. ఇచ్చిన భరోసా తీరా ఆ పార్టీలో చేరిన తర్వాత మాటలకే పరిమితం తప్పా చేతల్లో చూపించడం లేదు అనే బాధలో ఈటల రాజేందర్ ఉన్నారని అనుచరులు గుసగుసలాడుతున్నారు.
ఒకవైపు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర నుండి హుజురాబాద్ ఎన్నికల ఇంచార్జ్ మంత్రి తన్నీరు హరీష్ రావు , ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, కార్యకర్తలు,నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఈటల రాజేందర్ గుండెల్లో రైళ్ళు పరుగెట్టిస్తున్నాయి. ఒక పక్క తన ప్రత్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం టీఆర్ఎస్ శ్రేణులంతా కృషి చేస్తుంటే తాను చేరిన బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్,ఎంపీలు ధర్మపురి అరవింద్,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,ఎమ్మెల్యేలు రఘునందన్ రావు,రాజాసింగ్ మొదట్లో హుజురాబాద్ నియోజకవర్గంలో కన్పించి ఆ తర్వాత కనుమరుగైయ్యారు. అసలు ఆ నియోజవర్గం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
దీంతో ఈటల రాజేందర్ తనను పార్టీలో ఎవరు పట్టించుకోవడం లేదు. కనీసం తన కోసం హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచారం కూడా నిర్వహించడంలేదు. తనను గాలికొదిలేశారు అనే ఆలోచనలో ఈటల రాజేందర్ తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు కన్పిస్తుంది. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు సంగతి పక్కనెట్టు కనీసం టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తానా అనే తీవ్ర నిరాశలో ఈటల రాజేందర్ ఉన్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.