ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి గత ఏడాదిన్నర కాలంగా తన ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. ఈ కాలంలో ఏ ఫార్మాట్‌లోనూ సెంచరీ చేయలేదు. అయితే ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ తరఫున ఓపెనర్‌గా వస్తుండటంతో టీ20ల్లో మెల్లగా ఫామ్‌లోకి వస్తున్నాడు.
ఈ మధ్యే రెండు వరుస హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే అతని ఐపీఎల్ ఫామ్ ఇండియన్ టీమ్‌కు కూడా గుడ్ న్యూసే అంటున్నాడు మాజీ సెలక్టర్ సబా కరీమ్. యూట్యూబ్‌లో ఓ పాడ్‌కాస్ట్‌లో అతడు మాట్లాడుతూ.. టీ20 వరల్డ్‌కప్‌లో కోహ్లి బ్యాటింగ్ స్థానంపై స్పందించాడు.
టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్‌తో కలిసి విరాట్ ఓపెనర్‌గా వచ్చే అవకాశాలు ఉన్నట్లు సబా కరీమ్ అభిప్రాయపడ్డాడు. ఓపెనర్‌గా తన రోల్‌ను అతడు ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. రెండు వరుస హాఫ్ సెంచరీలు చేశాడు.
మంచి స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధిస్తున్నాడు. ఏ షాట్లు ఆడాలి. ఎలాంటి రిస్క్ తీసుకోవాలి అనేది అతనికి బాగా తెలుసు అని కరీమ్ అన్నాడు. విరాట్ ఫామ్ ఆర్సీబీతోపాటు ఇండియన్ టీమ్‌కు కూడా గుడ్‌న్యూసే అని అతడు చెప్పాడు.