కొల్లాపూర్ మండల పరిధిలోని అంకిరావుపల్లి గ్రామానికి చెందిన చంద్రారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.ఈ విషయాన్ని గ్రామ టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి దృష్టికి తీసుకు వచ్చారు.
దీంతో బాధితుడు చంద్రారెడ్డి మెరుగైన వైద్య సాయం కోసం ఎమ్మెల్యే బీరం సీఎం సహాయ నిధి నుంచి రూ.3లక్షలు ఎల్వోసీని మంజూరు చేయించారు. సదరు ఎల్వోసీని హైదరా బాద్‌లోని తన నివాసంలో బాధితుడి కుటుంబ సభ్యుడికి మంగళవారం ఎమ్మెల్యే అందజేశారు.