ప్రముఖ,వివాదాస్పద దర్శకుడు మరో సంచలన సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డాడు. కొండా పేరుతో సినిమాను ప్రకటించిన RGV.. కాంగ్రెస్ నేతలు కొండా మురళీధర్రావు, సురేఖ దంపతుల జీవితాన్ని సినిమాగా మలచనున్నాడు.
తాజాగా ఓ టీజర్ను విడుదల చేసిన RGV.. ‘ఎన్ కౌంటర్లో చంపేయబడ్డ రామకృష్ణ (RK)కి, కొండా మురళికి ఉన్న మహా బంధం గురించి వివరిస్తా. కొండా మురళిని కూడా కలిసి ఈ సినిమాపై ఫస్ట్ హ్యాండ్ సమాచారం పొందాను’ అని తెలిపాడు