బిజినపల్లి మండలంలోని పోలేపల్లి గ్రామానికి చెందిన కాశీం అనే వ్యక్తి గత నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో అతనికి వెన్నుముక, మరియు నడుము భాగంలో ఎముకలు బాగా దెబ్బతినడంతో వెంటనే ఆపరేషన్ చేయాలని నిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు సూచించడంతో అతని కుటుంబ సభ్యులు వెంటనే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారిని కలవడంతో వెంటనే కాశీం ఆపరేషన్ కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేయించి కాసిం భార్య నారాయణ గారికి నాలుగు లక్షల రూపాయల ఓ సి లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా ఆపదలో తమ కుటుంబాన్నీ అదుకున్నందుకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపిన కాసిం గారు అతని కుటుంబ సభ్యులు,ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..
