స్టాఫ్‌సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సెలెక్షన్ పోస్ట్ ఫేజ్ 9 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3261 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ఎంటీఎస్, డ్రైవర్, సైంటిఫిక్ అసిస్టెంట్, అకౌంటెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. డిగ్రీ, ఇటర్, పదో తరగతి పాసైనవారు అర్హులని పేర్కొన్నది. ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ 25 వరకు అందుబాటులో ఉంటాయి. రాతపరీక్ష ద్వార అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 3261 (జనరల్ 1366, ఎస్సీ 477, ఎస్టీ 249, ఓబీసీ 788, ఈడబ్ల్యూఎస్ 381)
ఇందులో ఎంటీఎస్, డ్రైవర్, సైంటిఫక్ అసిస్టెంట్, అకౌంటెంట్, హెడ్ క్లర్క్, కన్సర్వేషన్ అసిస్టెంట్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: డిగ్రీ, ఇంటర్, పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్. రాతపరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 28
రాతపరీక్ష: 2022, జనవరి లేదా ఫిబ్రవరిలో
వెబ్‌సైట్: www.ssc.nic.in