Home / NATIONAL / స్వలంగా పెరిగిన మోదీ ఆస్తులు

స్వలంగా పెరిగిన మోదీ ఆస్తులు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆస్తుల విలువ గత ఏడాదితో పోలిస్తే స్వలంగా పెరిగింది. మోదీ తాజా డిక్లరేషన్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.22 లక్షలు పెరిగింది. గత ఏడాది ఆయన ఆస్తుల విలువ రూ.2.85 కోట్లు ఉండగా, అది ఈ ఏడాది రూ.3.07 కోట్లకు పెరిగింది. ప్రధాని వెబ్‌సైట్‌లో ఈ వివరాలు ఉంచారు.మోదీ తాజా డిక్లరేషన్ ప్రకారం ఆయనకు రూ.1.5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. మార్చి 31 నాటికి ఆయన వద్ద రూ.36,000 నగదు రూపంలో ఉంది. గాంధీనగర్ బ్రాంచ్ ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్లతో ఆయన ఆదాయంలో ఈ స్పల్ప పెరుగుదల చోటుచేసుకుంది.

మోదీ ఎస్‌బీఐ గాంధీనగర్ ఎన్ఎస్‌సీ బ్రాంచ్‌లో 2021 మార్చి 31 నాటికి రూ.1.86 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము ఉంది. గత ఏడాది ఇది రూ.1.6 కోట్లుగా ఉంది. నరేంద్ర మోదీకి స్టాక్ మార్కెట్లో ఎలాంటి పెట్టుబడులు కానీ, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టిమెంట్లు కానీ  లేవు. దీనికి బదులు నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (రూ.8.9 లక్షలు),  లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు (రూ.1.5 లక్షలు), ఎల్ అండ్ టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు (ఇవి 2012లో రూ.20 వేలకు కొనుగోలు చేశారు) పెట్టుబడులు ఉన్నాయి. ఆయనకు 4 బంగారు ఉంగరాలు ఉన్నాయి.

వీటి విలువ రూ.1.48 లక్షలు. అలాగే రూ.1.97 కోట్ల విలువ చేసే చరాస్తులు ఉన్నాయి. ఆయనకు సొంత వాహనం లేదు. ఎలాంటి రుణాలు తీసుకోలేదు.ప్రధానికి గాంధీనగర్‌కు సెక్టార్-1 (గుజరాత్)లో సొంత ఫ్లాట్ (నెం.401/ఎ) ఉంది. దీనికి మరో ముగ్గురు జాయింట్ ఓనర్లు ఉన్నాయి. ఇందులో అందరికీ సమానమైన (25 శాతం చొప్పున) వాటా ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రి కావడానికి రెండు నెలల ముందు…2002 అక్టోబర్ 25న ప్రధాని ఈ ఆస్తి కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ ఆస్తి విలువ రూ.1.3 లక్షలు ఉంది. 2014లో ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత నుంచి ఆయన ఎలాంటి కొత్త ఆస్తులు కొనుగోలు చేయలేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat