కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం టికెట్లను టీటీడీ అన్‌లైన్‌లో విడుదల చేసింది. తొలిసారిగా ఉచిత దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. టీటీడీ ఇప్పటికే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 26 నుంచి (ఆదివారం) అక్టోబర్ నెల కోటా సర్వదర్శనం టోకెన్లను అందుబాటులో ఉంచనుంది. రోజుకు 8 వేల టికెట్ల చొప్పున విడుదల చేయనున్నది.
కాగా, ఆన్‌లైన్ టికెట్ల విడుదలతో ఆఫ్‌లైన్‌లో టోకెన్ల జారీని నిలివేయనున్నారు. టికెట్లు పొందిన భక్తులు రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా 72 గంటల ముందు కరోనా పరీక్ష చేయించుకుని, నెగిటివ్ సర్టిఫికెట్‌తో తిరుమలకు రావాలని అధికారులు స్పష్టం చేశారు.