సివిల్స్ -2020 ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 40 మందికి పైగా సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని కేటీఆర్ ట్వీట్ చేశారు.
100 లోపు ర్యాంకు సాధించిన వారిలో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు 9 మంది ఉన్నారు. వరంగల్‌కు చెందిన శ్రీజకు 20వ ర్యాంకు, వై మేఘస్వరూప్ 31(కర్నూల్), రాళ్లపల్లి జగత్‌సాయి 32(పశ్చిమ గోదావరి), ఎన్ సాయిమానస 48(మదనపల్లె, ఏపీ), అనీషా శ్రీవాత్సవ 66(హైదరాబాద్), దేవగుడి మౌనిక 75(హైదరాబాద్), కావాలి మేఘన 83(తాండూర్, వికారాబాద్), రవికుమార్ 84, యశ్వంత్‌కుమార్ రెడ్డి 93(కర్నూల్) ర్యాంకు సాధించారు.