Home / SLIDER / డీసీసీబీ మాజీ చైర్మన్ “మువ్వా” మాయాజాలం

డీసీసీబీ మాజీ చైర్మన్ “మువ్వా” మాయాజాలం

ఖమ్మం డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి కోట్లు రూపాయలు కొట్టేసిన కేటుగాళ్లు.. ఖమ్మం NST, రోటరీ నగర్, హెడ్ ఆఫీస్ బ్రాంచ్లలో జరిగిన ఫేక్ డాక్యుమెంట్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.. నకిలీ పత్రాలు సృష్టించి భారీ మొత్తంలో కోట్ల రూపాయలు దోచుకున్నారు.. కేటుగాళ్లు ఎంతలా దోచుకున్నారు అంటే ఫారెస్ట్ భూములకు సైతం ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి డబ్బులు కొట్టేశారు.. 2016-2017 సంవత్సరంలో జరిగిన ఫేక్ డాక్యుమెంట్ల భారీ స్కామ్ జరిగినట్టు బ్యాంకు ఉన్నతాధికారులు అధికారులు గుర్తించారు..ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకో లేడు అన్న సామెతగా అన్నట్టుగా ఫేక్ డాక్యుమెంట్ల పెట్టి బ్యాంకు డబ్బులు కొట్టేయడానికి సహకరించిన ఇంటి దొంగలు సైతం గుర్తించారు.. అసలు ఖమ్మం డిసీసీబీ బ్యాంకు నుంచి భారీ స్థాయిలో నిధులు మళ్లించడానికి సూత్రధారులు, పాత్రధారులు ఎవరో ఒకసారి చూద్దాం..

ఖమ్మం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి 6 కోట్లు స్వాహా చేసిన బడాబాబులు.. నకిలీ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకున్న 16 మంది, వాళ్లకు హామీ ఇచ్చిన గ్యారంటీర్లు పై సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఖమ్మం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బ్యాంక్ సీఈవో వీరబాబు, బ్యాంక్ చైర్మన్ కూరాకుల నాగభూషణం.. గత పాలకవర్గం హయాంలో రెండేళ్ల క్రితం ఖమ్మం ,NST బ్రాంచ్ ద్వారా 20 మంది, రోటరీ నగర్ బ్రాంచ్ ద్వారా ఒకరు, మెయిన్ బ్రాంచ్లో ఒకరు మొత్తం 16 మంది ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అగ్రికల్చర్ మార్ట్ గేజ్, రియల్ ఎస్టేట్ మార్ట్ గేజ్, సెక్యూర్డ్ ఓవర్ డ్రాఫ్ట్ లోన్లు తీసుకున్నారు..

బ్యాంకుల్లో తీసుకున్న లోన్లు కొంతమంది కొన్ని వాయిదాలు కట్టి తర్వాత కట్టడం మానేశారు.. అప్పులు వడ్డీతో కలిపి భారీగా పేరుకుపోయాయి.. 2020 మార్చి నెలలో కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత భారీస్థాయిలో బకాయిలు పేరుకుపోవడంతో బ్యాంకు లావాదేవీల మీద దృష్టి పెట్టారు.. లోన్లు తీసుకున్నవారు రికవరీ నోటీసులకు సైతం స్పందించకపోవడంతో షూరిటీ పెట్టిన ఆస్తులను వేలం వేసి లోన్లు రికవరీ చేసేందుకు అధికారులు వెళ్లారు.. సొమ్ము రికవరీకి డాక్యుమెంట్లో చూపెట్టిన ఆస్తులు ఏవి అక్కడ లేకపోవడంతో అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు.. నకిలీ డాక్యుమెంట్స్ ద్వారా బ్యాంకుని బురిడీ కొట్టించి డబ్బులు దోచుకున్నట్టుగా అధికారులు గుర్తించారు..

రికవరీ కోసం అధికారులు వెళ్లడంతో అసలు బాగోతం బట్టబయలైంది.. ఇటీవల జరిగిన నూతనశ పాలకవర్గం సమావేశంలో దీనిపై చర్చించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు..బ్యాంకు లో నకిలీ పత్రాలు పెట్టి లోన్ తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు NST బ్యాంక్ మేనేజర్ వెంకటేష్ తెలిపారు..

బ్యాంకులో జరిగిన భారీ స్కామ్ లో ఇంటి దొంగల పాత్ర కీలకమైనది.. డాక్యుమెంట్స్ పరిశీలించకుండానే ఇంత భారీ స్థాయిలో లోన్ లు ఎట్లా ఇచ్చారు.. ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి లోన్లు తీసుకున్న వారిపై చీటింగ్ కేసులు పెట్టడంతో పాటు, డాక్యుమెంట్లు పరిశీలించకుండా లోన్లు మంజూరు చేసిన బ్యాంక్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్ల క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిశీలన చేయకుండానే లోన్లు మంజూరు చేశారు.. అయితే అప్పటి డిసీసీబీ బ్యాంక్ చైర్మన్ మువ్వా విజయబాబు లోన్లు ఇవ్వాలంటూ సిఫార్సు లేఖలు ఇచ్చి అధికారుల మీద ఒత్తిడి తేవడం ద్వారా నిధులు మంజూరు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. లోన్లు ఇవ్వాలని సిఫార్సు చేసిన మాజీ డిసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, అప్పుడు ఉద్యోగంలో ఉన్న NST బ్యాంక్ మేనేజర్, రమ్య శ్రీ, ఫీల్డ్ ఇన్స్పెక్టర్ చేసిన ఆనందరావు మీద ఆరు సెక్షన్ల చీటింగ్, ఫోర్జరీ, క్రిమినల్ కేసులు పోలీసు నమోదు చేశారు.‌.

రైటరే.. చీటర్..
నకిలీ డాక్యుమెంట్ల స్కాంలో నకిలీ పత్రాలు సృష్టించిన రైటర్.. ఫేక్ డాక్యుమెంట్లతో కోట్ల రూపాయలు కొట్టేసిన బురిడి బాగోతంలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో లైసెన్స్ డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తున్న జనార్దనచారి సూత్రధారిగా గుర్తించారు పోలీసులు.. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తరహాలో నకిలీ డాక్యుమెంట్స్ పక్కగా తయారుచేశాడు..
NST బ్యాంకు బ్రాంచ్ లో చోటుచేసుకున్న నకిలీ ఫేక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సృష్టించిన బాగోతంలో డాక్యుమెంట్ రైటర్ జనార్దన చారి కీలక పాత్ర వహించాడు.. లేని భూములు, ఫ్లాట్ లకు ఫోర్జరీ తరహాలో రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి బ్యాంకు అధికారులు బురిడీ కొట్టించాడు.. నకిలీ పత్రాలతో కోట్ల రూపాయల రుణాలను కాజేసిన ఈ వ్యవహారంలో తీగలాగితే డొంక కదిలింది.. డాక్యుమెంట్ రైటర్ జనార్దనచారి సైతం ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా లోన్ తీసుకున్నాడు.. అతనితో పాటు రుణాలు పొంది అనుభవిస్తున్న అక్రమార్కుల బండారం మొత్తం బయటపడింది.. తాజా పరిణామాలతో కదులుతున్న అక్రమార్కుల డొంక..DCCB గత పాలకవర్గం అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడినట్టు ప్రస్తుత చైర్మన్ కూరాకుల నాగభూషణం ఆరోపిస్తున్నారు..

బ్యాంకులను నకిలీ ప్లాట్ల పత్రాలతో మోసగించినట్లుగా తేలడంతో మొత్తం 16 మంది డిఫాల్టర్లతో పాటు అప్పటి బ్యాంకు అధికారులు, ఉద్యోగస్తులు, మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు మీద ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. తాజా పరిణామాల నేపథ్యంలో గత డిసీసీబీ పాలకవర్గంలో సూత్రధారులు గా వ్యవహరించిన వారి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.. బ్యాంకు ని మోసగించి రుణాలు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.. వారి పేరు మీద ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను జప్తు చేయడం కోసం ప్రయత్నిస్తున్నాం..
..
ఖమ్మంలో జరిగిన NST డిసీసీబీ బ్యాంక్ లో నకిలీ డాక్యుమెంట్లు కుంభకోణం జిల్లా వ్యాప్తంగా అధికారులు అలర్ట్ అయ్యారు.. ఇతర బ్రాంచీలలో ఇలాంటి సంఘటనలు జరిగాయి అన్న కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు.. మరికొన్ని బ్రాంచ్ మీద అనుమానం రావడంతో విజిలెన్స్ అధికారులు, బ్యాంకు ఉన్నతాధికారులు దృష్టిసారించారు.. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక టర్నోవర్ కలిగిన ఖమ్మం జిల్లా డిసీసీబీ బ్యాంకు ఫేక్ డాక్యుమెంట్ల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat