ఏపీ అధికార వైసీపీ అధినేత,సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ‘సినిమా టికెట్లు ఆన్లైన్లో విక్రయించాలన్న నిర్ణయం మంచిది.
మాజీ ఎగ్జిబిటర్ నావి కొన్ని సూచనలు. నటీనటులు, టెక్నికల్ సిబ్బంది, కార్వాన్లు, హాస్టళ్లు, భోజనం తదితర వాటికి సంబంధించిన ఖర్చుని నిర్మాత నుంచి తీసుకుని.. ప్రభుత్వం దాన్ని వారికి నేరుగా ఇవ్వాలి. అప్పుడు బ్లాక్ మనీ అనే మాట ఉండదు. అనవసర ఖర్చులు, ఎగవేతలు ఉండవు’ అని ముద్రగడ అన్నారు.