తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు..ఎమ్మెస్సీ చదివి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న రజినీ అనే మహిళకు అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్గా మంత్రి కేటీఆర్ ఉద్యోగం ఇప్పించారు.
ఔట్ సోర్సింగ్ విభాగంలో ఆమెకు ఉద్యోగం కల్పిస్తూ GHMC కమిషనర్ ఆర్డర్ జారీ చేశారు. ఇద్దరు ఆడపిల్లల తల్లి రజినీ రోజువారి కార్మికురాలిగా పనిచేస్తోంది. విషయం తెలుసుకున్న కేటీఆర్ ఈరోజు ఆమెను కలిసి ఉద్యోగం కల్పించారు. దీంతో రజనీ ఆనందంతో కన్నీరు పెట్టుకుంది.