తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి..తాజాగా టాలీవుడ్ హీరోయిన్ నందిత శ్వేత ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి శివస్వామి మరణించారు.
ఈ వార్తను నందిత ట్విటర్ ద్వారా పంచుకుంది. ‘నా తండ్రి శివస్వామి 54 సంవత్సరాల వయస్సులో ఈరోజు కన్నుమూశారని నా శ్రేయోభిలాషులకు తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేసింది. పలువురు సినిమా ప్రముఖులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.