యువతను ఆవిష్కరణల వైపు మళ్లించేందుకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్‌ఐసీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, డిజైన్ థింకింగ్, ప్రాబ్లం సాల్వింగ్ నైపుణ్యాలను పెంపొందిస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సొంతంగా ఎదిగేందుకు స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ ఎంతగానో ఉపయోగపడుతున్నదన్నారు. సెకండ్ ఎడిషన్‌లో భాగం గా టీఎస్‌ఐసీ, విద్యాశాఖ, యునిసెఫ్, యువా, ఇంక్విల్యాబ్ సంయుక్తంగా 50వేల మంది విద్యార్థుల ఆలోచనలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు.
తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ -2021ను మంత్రులు సబితారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో ప్రారంభించారు. ఇంక్విల్యాబ్ చొరవతో యునిసెఫ్-యువా టీఎస్‌ఐసీతో కలిసి గతేడాది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. డిజైన్ థింకింగ్, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూరియల్ మైండ్‌సెట్‌లను పెంపొందించడానికి ఇది దోహదం చేస్తున్నది. 25వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 5,200 మంది టీచర్లు ఇందులో భాగస్వాములయ్యారు. మొదటి కార్యక్రమం పూర్త య్యే నాటికి 33 జిల్లాల నుంచి వివిధ సామాజిక సమస్యలకు పరిష్కారం చూపే ఆవిష్కరణలు 7,000 వరకు వెలుగుచూశాయి. జిల్లాల వారీగా ఒక్కో గొప్ప ఆవిష్కరణను గ్రాండ్ ఫినాలేకు ఎంపిక చేయనున్నారు.
ఈ ఏడాది కొత్తగా సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, ట్రైబల్ స్కూ ల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రైవేట్ బడ్జెట్ స్కూల్స్‌ను ఇందులో భాగస్వాములను చేయబోతున్నారు. తుది ఎంపికలో ఉన్న వారికి ఇంక్యుబేషన్ సపోర్ట్, నగదు బహుమతి అందించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ మొదటి ఎడిషన్ విజయవంతమైందని, విద్యార్థులను ఆవిష్కరణల వైపు మ ళ్లించేందుకు యునిసెఫ్, యువా, ఇంక్విల్యాబ్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, ప్రభుత్వ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత, సౌత్ ఏషియా యూనిసెఫ్ రీజినల్ ఆఫీస్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ స్పెషలిస్ట్ జాన్ బి ట్రూ తదితరులు పాల్గొన్నారు.