తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళితబంధు పథకాన్ని అర్హులైన కుటుంబాలకు అమలు చేస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.
కొత్తగా వివాహం అయినవారికి కూడా పథకం వర్తిస్తుందని తెలిపారు. అకౌంట్లలో పడిన డబ్బులను ప్రభుత్వం వెనక్కి తీసుకోదని, ఎవరూ ఆందోళన చెందొద్దని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ, విశ్రాంత ఉద్యోగులతోపాటు 65 ఏళ్లలోపు ఉన్న దళితులందరికీ డబ్బులు జమ అవుతాయని చెప్పారు.