దేశవాళీ టోర్నీల్లో ఆడే క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. మ్యాచ్ ఫీజును పెంచుతున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. 40 మ్యాచ్ల కంటే ఎక్కువ ఆడిన సీనియర్ ఆటగాళ్లకు రూ.60వేలు, అండర్-23 ప్లేయర్లకు రూ.25వేలు, అండర్-19 ఆటగాళ్లకు రూ. 20వేల మ్యాచ్ ఫీజు ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే కరోనా కారణంగా గత సీజనక్కు గానూ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 50శాతం పరిహారం కింద ఇస్తున్నట్లు చెప్పారు.
