వాముతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. పొట్ట ఉబ్బరం తగ్గించుకోవడానికి చక్కగా పనిచేస్తుంది. వాముని దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ప్రతి రోజు భోజనం చేసేటప్పుడు వేడి అన్నంలో మొదటి ముద్దలో పావు టీస్పూన్ పొడి వేసుకుని తినాలి.
ఇలా చేస్తే కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది. అలాగే వామును నిప్పులపై వేసి పొగ పీలిస్తే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.