తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ మరో సవాల్ విసిరారు. డ్రగ్స్ టెస్టులు చేయించుకోవడానికి తాను సిద్ధమని.. ఎయిమ్స్ టెస్టు కోసం రాహుల్ గాంధీ వస్తే తానూ వస్తానన్నారు.
చర్లపల్లిలో జైలు జీవితం గడిపిన వ్యక్తులు రాహుల్‌ను ఒప్పించాలన్నారు. తాను టెస్టు చేయించుకుని క్లీన్ చీట్ వస్తే పదవి నుంచి తప్పుకుంటారా అని అడిగారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని ప్రశ్నించారు.