ఏ విపత్తు వచ్చినా మొదట స్పందించే సినీ పరిశ్రమే ఇప్పుడు కష్టాల్లో ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కరోనా వల్ల నిర్మాణ వ్యయం పెరిగిందని, నష్టపోయిన పరిశ్రమను తెలుగు రాష్ట్రాల సీఎంలు ఆదుకోవాలని కోరారు.
లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. ప్రస్తుతం సినిమాలు తీయాలంటే ఆలోచించాల్సి వస్తోందన్నారు. అయినా అభిమానులను నిరాశపర్చకుండా, వినోదాన్ని పంచేందుకు కృషి చేస్తున్నామన్నారు.