తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. సీఎం కేసీఆర్ సెక్రటేరియట్‌కు వచ్చాడా.. ఫామ్ హౌస్‌లో ఉన్నాడా కాదు.. పనులు అవుతున్నాయా? లేదా? చూడాలన్నారు.
ముఖ్యమంత్రిని పట్టుకొని తాగుబోతు అనడం సరికాదన్నారు. ఎవర్నీ వదిలి పెట్టం.. వాళ్ళ బాగోతం మొత్తం తెలుసు బయట పెడతాం.. అవసరమైతే రాజద్రోహం కేసులు పెడుతామని కేటీఆర్ అన్నారు.
కొంత మంది నాయకులు బ్లాక్ మెయిల్ చేసి పైసలు సంపాదిస్తున్నారు. సున్నాలు వేసుకునే వాళ్లు.. కన్నాలు వేస్తున్నారు.. మల్లారెడ్డి సవాల్‌కు భయపడి పారిపోయినోడు.. నోటికి వచ్చినట్టు వాగడం తప్ప ఏం చేయడం లేదని కేటీఆర్ విమర్శించారు.