Home / SLIDER / నువ్వు అడ్డగాడిదవా? సంకర గాడిదవా?

నువ్వు అడ్డగాడిదవా? సంకర గాడిదవా?

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసే వారిపై రాజద్రోహం కేసులు పెట్టడానికి కూడా వెనుకాడబోమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే గుడ్డలూడదీసి కొడుతామని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనను డ్రగ్స్‌ అంబాసిడర్‌ అనటంపై కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధమని, మరి కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీ కూడా పరీక్షకు సిద్ధమా? అని సవాలు విసిరారు. రూ.50 కోట్లతో పీసీసీ పదవి కొనుక్కున్నోడు రేపు సీట్లు అమ్ముకోడని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. ఏ పనీ పాటాలేనివాళ్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని, వారిని ప్రజాబలంతో తిప్పికొడతామని తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రగతితోపాటు వివిధ అంశాలపై మీడియాతో కేటీఆర్‌ పంచుకొన్న అభిప్రాయాలు ఆయన మాటల్లోనే…

నువ్వు అడ్డగాడిదవా? సంకర గాడిదవా?
రియల్‌ ఎస్టేట్‌లో ఒక లేఔట్‌ అమ్మాల్నంటే ఏం చేస్తరు? ముందు అందమైన కమాన్‌ పెట్టి, అద్భుతం జరిగిందని చెప్పి ప్లాట్లు అమ్మేస్తరు. ఇప్పుడు కాంగ్రెస్‌ల జరుగుతున్నది ఇదే. కాంగ్రెస్‌లో పీపీసీ పోస్టే అమ్ముకుంటరు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాకూర్‌ అనే వ్యక్తి రూ.50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్‌రెడ్డికి అమ్ముకున్నడని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నరు. పోస్టు కొనుక్కున్నోళ్లు టికెట్లను అమ్ముకోవాలె కదా! అందుకే రియల్టర్‌ లెక్క నాలుగు మీటింగ్‌లు పెట్టి.. నలుగురైదుగుర్ని పోగేసి మార్కెట్ల గిరాకీ ఉందని నమ్మిస్తున్నడు. దీనివల్ల అయ్యేది లేదు.. పొయ్యేది లేదు. ప్రజలు చాలా చైతన్యవంతులు. విచక్షణ, వివేచన. విజ్ఞతతో ఆలోచించి ఓటేస్తారు. సీనియర్‌ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి ఢిల్లీ నుంచి వచ్చి తెలంగాణలో పని మంచిగ అయిందని చెప్పిండు. రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తేనే కదా పొగిడింది. దీనికి అంత దుగ్ధ ఎందుకు? ఆయనను గాడిద అంటవా? మరి నువ్వు అడ్డగాడిదవా? సంకరగాడిదవా? కాంగ్రెస్‌ వాళ్లు గజ్వేల్‌లో సభ పెట్టినమని జబ్బలు చరచుకుంటున్నరు. అయినా.. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్‌ దక్కుతదా?. వాళ్లు రాష్ట్రంలో నూరు చోట్ల పెట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదు. కాంగ్రెస్‌ అంటే కరెంట్‌ ఇవ్వని పార్టీ.. మంచినీళ్లు ఇవ్వని పార్టీ.. ఫ్లోరోసిస్‌ ఇచ్చిన పార్టీ.. తెలంగాణ సకాలంలో ఇవ్వకుండా చావగొట్టిన పార్టీ. కొత్త అధ్యక్షుడు రాగానే కొత్తదనం ఏమొస్తది? బ్లాక్‌మెయిల్‌ చేయాలె.. పైసల్‌ సంపాదించాలె.. వ్యాపార సంస్థల దగ్గర పైసలు గుంజాలె.. అంతే.

అమిత్‌షాకు తెలంగాణ మీద ప్రేమ ఉన్నదా?
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాష్ర్టానికి వచ్చి ‘మేము మజ్లిస్‌కు భయడం’ అన్నడు. ఇక్కడ ఎవరు భయపడుతున్నారు? తెలంగాణకు కేంద్రం చట్టబద్ధంగా రావాల్సినవి తప్ప వేరే ఏమైనా ఇచ్చిందా? ట్రైబల్‌ యూనివర్సిటీ, కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌, బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడరు? తెలంగాణ విమోచన దినంపై వాళ్లకు అంత ప్రేమే ఉంటే.. తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొన్నవారు ఇంకా ఉన్నరు.. కేంద్ర హోంమంత్రి హోదాలో వారికి పెన్షన్లు ఇయ్యొచ్చు కదా. కేసీఆర్‌ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రితో కొట్లాడి కొంతమందికి ఇప్పించారు. సాయుధపోరాటంలో బీజేపీ పాత్ర ఏంది? ఆనాడు ఉద్యమానికి నాయకత్వం వహించింది కమ్యూనిస్టులు. చరిత్రకు మతం రంగు పూసి నాలుగు ఓట్లు వేయించుకోవాలనే ప్రయత్నం తప్ప, తెలంగాణకు నిజమైన విమోచనం జూన్‌ 2 అని సీఎం కేసీఆర్‌ స్వయంగా శాసనసభలోనే చెప్పారు. ఏపీ నుంచి విముక్తి అయిన రోజే మాకు నిజమైన విముక్తి అని చెప్పినం. ఒకప్పుడు శాసనభలో తెలంగాణ నిషేధిత పదం. అలాంటి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎప్పుడైతే విముక్తి వచ్చిందో..అదే అసలైన విముక్తిదినం. అయినా అమిత్‌ షా పర్యటనలో ఏముంది? కేంద్రం నుంచి పెద్దమనిషి వచ్చినపుడు రాష్ట్ర ఎంపీలు ఏమన్నా అడగాలె కదా? కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీ కావాలని మేం కేంద్రాన్ని అడిగినం. అది పక్కకుపెట్టి బండి సంజయ్‌.. ‘నా ఆయుష్షంతా నీకు పోస్తా’ అంటున్నడు. పసుపుబోర్డు తెస్తానని బాండ్‌పేపర్‌మీద రాసిచ్చినాయన ‘నాకు అమిత్‌షాను టచ్‌ చేయాలని అనిపిస్తుంది’ అంటరు. మేము ప్రజల గుండెలను టచ్‌ చేయమని అడుగుతున్నం. ఢిల్లీ పార్టీలకు సిల్లీ పాలిటిక్స్‌ తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్షలపై స్పష్టత లేదు.

కాంగ్రెస్‌ 60 ఏండ్ల పాలనలో ఒక్క దళిత కుటుంబానికైనా దళితబంధు వంటి కార్యక్రమం ఇచ్చిందా? ఇప్పుడు నాలుగైదు రాష్ర్టాల్లో వాళ్లే అధికారంలో ఉన్నారు కదా.. దమ్ముంటే అక్కడ దళితబంధు, బీసీ బంధు పెట్టండి. బీజేపీ నేత బండి సంజయ్‌ బీసీ బంధు కావాలంటున్నడు. ప్రధాని మోదీకి చెప్పి రాష్ట్రంలోని బీసీలకు రూ.15 లక్షల చొప్పున ఇప్పించు. మేం వద్దంటున్నామా? మేం వ్యూహాత్మకంగా అట్టడుగు వర్గాలతో మొదలుపెట్టి.. పై స్థానికి వెళ్తున్నం. దీనిపై మీకెందుకు నొప్పి?

ఒక్కొక్కడి గుడ్డలూడదీస్తం
సీఎం కేసీఆర్‌పై ఒకడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే.. ఇంకొకడు సీటీ లేస్తడు. వాళ్లను ఇడిసిపెట్టేది లేదు. ఒక్కొక్కడి గుడ్డలూడదీస్తం. వారి మొత్తం చరిత్ర మాకు తెలుసు. సున్నాలు వేసుకునే స్థాయి నుంచి ఇవ్వాళ కన్నాలేసుకునే స్థాయికి ఎదిగారు. ఎట్లా ఎదిగారో మాకు తెలుసు. రోడ్లమీద పెయింట్లు వేసి బతికినోడికి ఇయ్యాల జూబ్లీహిల్స్‌లో నాలుగు ఇండ్లు, నాలుగు ఆఫీసులు ఎట్లా వచ్చినాయో అడుగుతం. ఇంకొకడు సీఎం కేసీఆర్‌కు ఇన్నికోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినయి అంటున్నడు.

కేసీఆర్‌ మొదటి నుంచి దొరనేనా.. లేకపోతే మధ్యల అయిండా అనేది తెలుసుకోండి. కేసీఆర్‌ పుట్టుడే వందల ఎకరాలున్న కుటుంబంలో పుట్టిండు. కావాల్నంటే ఎన్నికల అఫిడవిట్‌లో చూసుకోండి. సీఎంను అన్నోళ్లను విడిచేది లేదు. ఎన్ని అనాల్నో అన్ని అంటం. అంతకంటే ఎక్కువే అంటం. కోర్టుకు పోతే సచ్చేదాకా తేలదని అనుకుంటున్నరేమో. మహారాష్ట్రలో కేంద్రమంత్రి నారాయణ రాణె మీద కేసు పెట్టినట్టే మేం బరాబర్‌ కేసులు పెడతం. రాష్ట్ర పురోగతిపై అసత్యాలు ప్రచారం చేసినా, అబద్ధ్దాలు చెప్పినా, తెలంగాణ రాష్ర్టాన్ని కించపరిచే ప్రయత్నం చేసినా రాజద్రోహమే అవుతుంది. అటువంటి వారిపై తప్పకుండా రాజద్రోహం కేసుపెడతం. అందులో అనుమానం లేదు.

దమ్ముంటే మీ రాష్ర్టాల్లో దళితబంధు పెట్టండి
దళితబంధుకు స్పూర్తి సీఎం కేసీఆర్‌ గతంలో సిద్దిపేటలో తెచ్చిన దళిత చైతన్యజ్యోతి. బడ్జెట్‌లో దళితబంధుకు రూ.1,000 కోట్లు పెట్టినప్పుడు హుజూరాబాద్‌ ఉపఎన్నిక లేదుకదా? అప్పుడు ఈటల రాజేందర్‌ శాసనసభలో మంత్రిగా నా పక్కనే కూర్చున్నరు.

అయినా.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికకోసమే అంటూ ఇప్పుడు ప్రచారం చేస్తున్నరు. రేపు ఉప ఎన్నిక అయిపోగానే దళితబంధు ఆగిపోదు కదా! వచ్చే బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు పెడతామని సీఎం స్వయంగా చెప్పారు. ప్రతి ఒక్కరికీ ఇస్తామన్నరు. దళిత దండోరా అని సభలు పెట్టి అందరికీ ఇయ్యాలని అంటున్నరు. కాంగ్రెస్‌ 60 ఏండ్లల్లో ఒక్క దళితకుటుంబానికి ఇంత మంచి కార్యక్రమం చేపట్టిందా? రాజస్థాన్‌, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ వంటి నాలుగైదు రాష్ర్టాల్లో మీరే ఉన్నరు కదా.. దమ్ముంటే అక్కడ దళితబంధు, బీసీబంధు పెట్టండి. సమాజంలో అట్టడుగున ఉన్న దళితులతో స్టార్ట్‌ చేసినం. ఆ తర్వాత పై స్థాయికి వెళ్తాం. బండి సంజయ్‌ బీసీ బంధు కావాలని అంటున్నడు. మోదీకి చెప్పి రాష్ట్రంలోని బీసీలకు రూ.15 లక్షలు ఇప్పించు. మేమేం వద్దనటం లేదు. మాకు చేతనైంది వ్యూహాత్మకంగా చేస్తుంటే మీకెందుకు నొప్పి?

మా విధి మేము నిర్వర్తిస్తున్నాం
ప్రభుత్వంలో ఉన్నవాళ్లు సహజంగా అధికారిక కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. మేమూ అలాగే మా పనిచేసుకొంటూ పోతున్నాం. మలబార్‌ గోల్డ్‌ కంపెనీ రూ.750 కోట్ల పెట్టుబడితో వచ్చింది. తెలంగాణ చరిత్రలో మొదటిసారి మూడు జూట్‌ మిల్లులు ఒకేరోజు రూ.887 కోట్ల పెట్టుబడి పెడుతున్నయి. రెండు దేశాల రాయబారులు వచ్చారు. ఇట్లా మా మంత్రులకు, నాయకులకు చేతినిండా పని ఉన్నది. అదే సమయంలో ప్రతిపక్షాలకు పనిలేదు. సీఎం కేసీఆర్‌ నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులతో బ్రహ్మాండంగా వచ్చిన పంటలు, రైతుబంధు, రుణమాఫీతో సంతోషంగా ఉన్న రైతులు, చెరువుల్లో చేపలు, పల్లెల్లో నర్సరీలు, వైకుంఠధామాలు, ట్రాక్టర్లు.. ఇలా అభివృద్ధిని చూసుకుంటూ ఒకాయన పాదయాత్ర చేస్తున్నడు. నిన్నగాక మొన్న వచ్చినాయన ‘నేను కూడా మార్కెట్‌లో ఉన్నా’ అని చెప్పుకోవడానికి హడావుడి చేస్తున్నడు. అంతేతప్ప ఎలక్షన్‌ వాతావరణం ఏమీ లేదు. రాష్ట్రంలో ఇప్పుడు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక మాత్రమే ఉన్నది. దానికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరంలేదు. అక్కడ టీఆర్‌ఎస్‌ గెలుపుపై ఎవరికీ అనుమానం లేదు. అక్కడ టీఆర్‌ఎస్‌ గెలువగానే కేంద్ర ప్రభుత్వం పడిపోతదా? ఒక్క ఉప ఎన్నికతో ఏదో తలకిందులైపోతుందనే బిల్డప్‌ అవసరం లేదు. నాగార్జునసాగర్‌లో జానారెడ్డిని గెలిపించడానికి కాంగ్రెస్‌ సర్వశక్తులొడ్డింది. మేము యువకుడు భగత్‌ను నిలబెడితే ప్రజలు గెలిపించారు. ఈ రోజు ప్రజలు అభ్యర్థిని కాకుండా టీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ చేస్తున్న కార్యక్రమాలను చూస్తున్నరు. ఆయన నాయకత్వంపై అపారమైన విశ్వాసం ఉన్నది. కాబట్టి ఉప ఎన్నిక ఏదొచ్చినా టీఆర్‌ఎస్‌దే ఘనవిజయం.

డ్రగ్స్‌కేసుతో నాకేం సంబంధం?
నాకూ డ్రగ్స్‌కు ఏం సంబంధం? నన్ను డ్రగ్స్‌కు అంబాసిడర్‌ అన్నోడు మనిషా? పశువా? నా రక్తం ఇస్తా, వెంట్రుకలు ఇస్తా, నా లివర్‌ ముక్క కోసుకుంటామంటే ఇస్తా. ఏ పరీక్ష చేపిస్తవో చేపియ్యు. మీ రాహుల్‌గాంధీని రమ్మంటవా మరి.. రక్తపరీక్షకు. వెంట్రుకల పరీక్షకు వస్తాడా రాహుల్‌గాంధీ? బేస్‌లెస్‌ మాటలు మాట్లాడితే అంతేస్థాయిలో రెస్పాండ్‌ కావాల్సి వస్తది. ఈడీకి ఎవడో బఫూన్‌గాడు ఫిర్యాదు చేస్తే నాకేం పని? నాకేం సంబంధం? ఎవడో చిల్లరగాడు మాట్లాడితే, ఆ మాటలన్నీ యథాతథంగా కొన్ని పత్రికలు ప్రచురిస్తాయి. వాడు చిల్లరగాడు.. మరి మీ బుద్ధికి ఏమైంది? నేను పచ్చిబూతులు తిడతా.. రాస్తారా? ఒక బాలికపై అఘాయిత్యం జరిగింది. అదొక దారుణమైన సంఘటన. నాక్కూడా ఆడపిల్ల ఉన్నది. అందరం బాధపడ్డం.. ఏడ్చినం. అక్కడికిపోయి హడావుడి చేస్తేనే ప్రేమున్నట్టా? జరగాల్సింది జరిగింది కదా? తెలంగాణలో చేయకూడని పనిచేసేటోడికి తగిన శాస్తి జరుగుతదని తేలింది. యూపీలో హాథ్రాస్‌ ఘటన జరిగి ఏడాది అయిపోయింది కదా.. ఆ కుటుంబానికి న్యాయం జరిగిందా? దిశ అనంతర ఘటనకు దేశం హర్షించిందా? లేదా?

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కు నోరు పెగలదెందుకు?
బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఒకప్పుడు గురుకుల పాఠశాలలు పెట్టిన కేసీఆర్‌ను పొగిడారు. ఈ రోజు కేంద్రం ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వకపోతే ప్రవీణ్‌కుమార్‌ నోరెందుకు పెగలడం లేదు? దేశ్యాప్తంగా 157 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తే తెలంగాణకు ఒక్కటన్నా రాలేదు. రాష్ర్టానికి ఐఐఎం ఇవ్వలేదు. వీటిపై ప్రవీణ్‌ ఎందుకు మాట్లాడరు? 60 ఏండ్ల కాంగ్రెస్‌ హయాంలో దళితులు, బహుజనుల మీద జరిగినన్ని దాడులు మరెప్పుడూ జరగలేదు? వాటి గురించి ఎందుకు మాట్లాడరు. వైఎస్‌ షర్మిల కూడా కేసీఆర్‌ను తప్ప బీజేపీని అనరు.

మాజీ కేంద్రమంత్రి ఢిల్లీ నుంచి వచ్చి తెలంగాణలో పని మంచిగ అయిందని చెప్పిండు. రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తేనే కదా పొగిడింది. దీనికి అంత దుగ్ధ ఎందుకు.. రేవంత్‌? ఆయనను గాడిద అంటవా? మరి నువ్వు అడ్డగాడిదవా? సంకర గాడిదవా? పోస్టు కొనుక్కున్నోళ్లు టికెట్లు అమ్ముకోవాలె కదా! అందుకే రియల్టర్‌ లెక్క నాలుగు మీటింగ్‌లు పెట్టి.. నలుగురైదుగుర్ని పోగేసి మార్కెట్ల గిరాకీ ఉన్నదని నమ్మిస్తున్నడు. దీనివల్ల అయ్యేది లేదు..పోయేదీ లేదు.

తిట్టేటోడికే వ్యూస్‌ ఎక్కువ
‘మనదేశంలో న్యూసెన్స్‌ వాల్యూ ఎక్కువ ఉన్నవాటికే మీడియాలో ప్రాధాన్యం ఎక్కువ ఉంటది. నిర్మాణాత్మకంగా ఉన్నవాటికి చాలా తక్కువ ప్రాధాన్యం ఉంటది’ అని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ అన్నరు. అదే నిజం. ఇయ్యాలరేపు తిట్టేవానికే వ్యూస్‌ ఎక్కువ. ఎలక్ట్రానిక్‌ మీడియా యూట్యూబ్‌ చానళ్లలో నిర్మాణాత్మక పనుల్ని కూడా చూపెట్టాలి. డబుల్‌బెడ్‌రూం..దేశంలో మరెక్కడైనా ఉన్నదా? రెండుసార్లు రుణమాఫీ ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా? ఏటా రూ.15 వేల కోట్లతో రైతుబంధు, పల్లె ప్రగతి, పంచాయతీలుగా తండాలు, ధరణి, పాలనా సంస్కరణలు వంటివి ఇంకెక్కడైనా ఉన్నయా?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat