చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గొప్ప మానవతావాది అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎంజీ రంజిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా బేగంపేటలో దివ్యాంగులకు ట్రై మోటార్ వాహనాలను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు.
గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా 105 మందికి ట్రై మోటార్ వాహనాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రంజిత్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారు. ఎంజీ రంజిత్ రెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
గిఫ్ట్ ఏ స్మైల్ కింద దివ్యాంగులకు చేయూతనిస్తున్నారు. రాష్ట్ర సమస్యలపై రంజిత్ రెడ్డి పార్లమెంట్‌లో ప్రశ్నిస్తున్నారు. చేవెళ్లలోని ప్రభుత్వ ఆస్పత్రులకు 7 అంబులెన్స్‌లు ఇచ్చారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామానికి విద్యార్థుల ఆన్‌లైన్ క్లాసుల కోసం అన్ని గ్రామాలకు డిజిటల్ టీవీలు అందించారు. రంజిత్ రెడ్డి చేవెళ్ల ఎంపీ కావడం ఆ నియోజకవర్గ ప్రజల అదృష్టమని కేటీఆర్ అన్నారు.