తెలంగాణ రాష్ట్రంలో గౌడ, ఎస్సీ, ఎస్టీ కులస్తులకు మద్యం దుకాణాలలో రిజర్వేషన్లు కల్పిస్తూ క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయా కుల సంఘాలతో కలిసి రవీంద్రభారతిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గిరిజన మహిళలతో కలిసి ఆడిపాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వైన్ షాపుల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించడం చారిత్రిక ఘట్టమన్నారు. ఈ నిర్ణయంతో ఆయా కులస్తులు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉందన్నారు.
సమావేశంలో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్, ప్రభుత్వ విద్యా మౌలిక సదుపాయాల కల్పన శాఖ చైర్మన్ నాగేందర్ గౌడ్, గౌడ సంఘాల రాష్ట్ర నాయకులు పల్లె లక్ష్మణరావు గౌడ్, బాలగొని బాలరాజు గౌడ్, మాజీ చైర్మన్ రాజేశం గౌడ్, వట్టికూటి రామారావు గౌడ్, ప్రతాని రామకృష్ణ గౌడ్, డా. విజయ భాస్కర్ గౌడ్, నాగేశ్వరరావు, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, వేములయ్య గౌడ్, చింతల మల్లేశం గౌడ్, అయిలి వెంకన్న గౌడ్, రాజయ్య గౌడ్, ప్రతాప్ లింగం గౌడ్, అంబాల నారాయణ గౌడ్, యూనివర్సిటీ నాయకులు రవికుమార్ గౌడ్, ఎస్సీ నాయకులు చందు, జంబులయ్య, ఎస్టీ నాయకులు కిషన్ నాయక్ తదితర రాష్ట్ర నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.