తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహా నగరంలోని సైదాబాద్‌లో అత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ పరామర్శించారు.
తీరని దుఃఖంలోఉన్న చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చారు. నిందితుడు రాజుని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామన్నారు. చిన్నారి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించారు.
బాధిత కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రుల రాకతో పోలీసులు సింగరేణి కాలనీలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే నిందితుడు రాజు రైల్వే ట్రాక్ పై అత్యహత్యకు పాల్పడి మృతి చెందిన సంగతి విధితమే.