యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సైదాబాద్ కీచకుడు రైల్వే పట్టాలపై శవమై తేలాడు. ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్ పై అతని డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. మృతుడి శరీరంపై ఉన్న పచ్చబొట్టు ద్వారా ఆ వ్యక్తి అత్యాచార నిందితుడిని గుర్తించినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
కొద్ది రోజులుగా ఆయన కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ఎట్టకేలకు ఈ రోజు రాజు రైల్వే పట్టాలపై శవమై కనిపించడంతో నెటిజన్స్, పలువురు సెలబ్రిటీలు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ సినీనటుడు మంచు మనోజ్ .. ‘ఈ వార్త చెప్పినందుకు థ్యాంక్యూ సర్.. దేవుడు ఉన్నాడు’ అంటూ మంచు మనోజ్ స్పష్టం చేశారు.
మంచు మనోజ్ కొద్ది రోజుల క్రితం బాలిక ఇంటికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశాడు. నాని, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి వారు కూడా నిందితుడికి తగిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఎట్టకేలకు రాజు కథ ఇలా సుఖాంతం అయింది.