సిద్దిపేట నియోజకవర్గం సిద్దిపేట అర్భన్ మండలం మందపల్లి గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు , ఉమ్మడి మెదక్ జిల్లా పశుగణాభివృద్ది సంస్థ చైర్మన్ దేవునూరి తిరుపతి నిన్న అనారోగ్యంతో మృతి చెందారు.. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మందపల్లి లో తిరుపతి భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులర్పించారు.. ఆయన మృతి పట్ల తన సంతాపాన్ని తెలియజేశారు..
కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఒక మంచి నిబద్ధత గల నాయకుణ్ణి కోల్పోయామని పార్టీ కి , ప్రజలకు ఎంతో అంకితభావం తో పని చేసాడని, మృదుస్వభావి , అయాన తో , తన కుటుంబం తో తనకు ఉన్న 25 ఏళ్ల అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఎంతో సాన్నిహిత్యం ఉందని , ఆయనను వరించని పదవి అంటూ లేదని నిత్యం ప్రజా సేవలో , గ్రామ అభివృద్ధికి ప్రజల గురించి పరితపించే నాయకుడు అని ఆయన సేవలను కొనియాడారు..
పదవి కన్న ప్రజా సేవ గొప్పది అని తన నిరాడంబరతను చాటుకున్నారని , పార్టీ కి ప్రభుత్వం కు అందించిన సేవలు మరువలేనివని , ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా పశుగణాభివృద్ది సంస్థ గా పాడి రైతులకు ఆయన ఇచ్చిన సూచనలు మరువలేనివని, ఆయన మృతి చాలా బాధాకరమని చెప్పారు.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధించారు..