ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత,సీఎం జగన్ పాలనలో రాష్ట్రం ఆత్మహత్యల ప్రదేశ్ మారిపోయిందని మాజీ మంత్రి టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ఉద్యోగం రాలేదని కర్నూలు జిల్లాకు చెందిన యువకుడు వీరాంజనేయులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం..
వైసీపీ ప్రభుత్వం అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2.30 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరిన లోకేశ్.. యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు.