తమిళ, తెలుగు చిత్రసీమల్లో అగ్రహీరోయిన్‌గా కొనసాగుతున్న నటి సమంత అక్కినేని. ఒక వైపు కొత్త సినీ ప్రాజెక్టులతో, మరోవైపు వాణిజ్య ప్రకటనల కోసం ప్రత్యేక ఫొటోషూట్లతో బిజీగా గడుపుతోంది. అదేసమయంలో ఈమె గురించి రూమర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తన భర్త, టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్యతో మనస్పర్థలు తలెత్తినట్టు వార్తలు వస్తున్నాయి. వీటికి మరింత ఊతమిచ్చేలా సమంత సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరును కూడా మార్చుకుంది.
ఈ రూమర్‌పై నెటిజన్లు వివిధ రకాలైన కామెంట్స్ చేస్తున్నారు. ఇవేమీ పట్టించుకోని సమంత… తనపని తాను చేసుకుంటూ ముందుకు సాగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన ఓ ప్రత్యేక ఫొటో షూట్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్స్పోజింగ్ దిశగా సాగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.