వినాయక చవితి కి ఒక రోజు ముందు కోర్టు తీర్పు వచ్చిందని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి అన్ని పండుగలను ప్రజలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైకోర్టు లో రివ్యూ పిటీషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు.