మా (Maa Elections) అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు బండ్ల గణేశ్ ఎంట్రీతో రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మా అధ్యక్ష బరిలో నిలుస్తున్న్ ప్రకాశ్ రాజ్ సినీ నటులతో సమావేశమయ్యారు. 100 మంది నటీనటులతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రణాళిక, సభ్యుల సంక్షేమంపై చర్చించారు. అయితే ఈ నేపథ్యంలో విందుల పేరుతో సమావేశాలు వద్దంటూ బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ కు ప్రకాశ్ రాజ్ స్పందించారు.
ఎన్నికల నొటిఫికేషన్ 19న వస్తుందని..దేశంలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ర్యాలీలపై బండ్ల గణేశ్ స్పందిస్తే బాగుంటుందని ప్రకాశ్ రాజ్ సూచించారు. అసోసియేషన్ ఎన్నికలంటే అందరితో మాట్లాడటం జరుగుతుంది. బండ్ల గణేశ్ మాటలకు షాక్ అయ్యాను.
బండ్ల గణేశ్ కు సమాధానమివ్వడం సమయం వృధా అని ప్రకాశ్ రాజ్ అన్నారు. ఈ రోజు కొంతమంది ఆర్టిస్టులను పిలిచి మాట్లాడాం. చాలా మంది సభ్యులు యాక్టివ్ గా లేరు. కొంతమంది హీరోలు సభ్యులుగా ఉన్నా ఓటు వేయడం లేదన్నారు. మరోవైపు జీవిత మాట్లాడుతూ..బండ్ల గణేశ్ తీరు చైల్డిష్ గా ఉందన్నారు.