వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగ సందర్భంగా చారిత్రాత్మక వేయిస్తంభాల గుడిలో వినాయకుడికి పూజలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
ఈ కరోనా మహమ్మారి నుండి ప్రపంచాన్ని కాపాడాలని, తెలంగాణ ప్రజలు సుఖ,సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకున్నాను. సీఎం కేసీఆర్ కృషితో రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. వేయి స్తంభాల గుడిని ఆధ్యాత్మికంగా వెలుగొందే విధంగా అభివృద్ది చేస్తున్నాం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.