స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లి తర్వాత సినిమాలకి గుడ్‌బై చెప్పబోతుందా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. 2005 సంవత్సరంలో శరత్‌కుమార్ హీరోగా వచ్చిన చిత్రం ‘అయ్యా’. ఈ మూవీ ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన మలయాళ నటి నయనతార. అలా.. గత 16 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో రాణిస్తోంది.
తమిళం, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఆమె క్రేజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. అదేసమయంలో నయనతార వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా హీరో శింబు, నృత్యదర్శకుడు ప్రభుదేవాలతో ప్రేమాయణం విఫలం కావడం వంటి చేదు సంఘటనలు కూడా జరిగాయి. ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ఆమె పీకల్లోతు ప్రేమలో వుంది.
అదేసమయంలో వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగినట్టు వార్తలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో నయనతార అన్ని భాషల్లో కమిట్ అయిన ప్రాజెక్టులను పూర్తి చేసి పెళ్ళిపీటలెక్కాలన్న తలంపులో ఉన్నట్టు తెలుస్తోంది. వివాహం తర్వాత నటనకు స్వస్తి చెప్పి తమ సొంత నిర్మాణ సంస్థపై సినిమాలు నిర్మించడం, అలాగే, దర్శకత్వం వహించాలని నయనతార భావిస్తున్నట్టు సమాచారం. అయితే నయన్ సన్నిహిత వర్గాలు మాత్రం ఇందులో నిజం లేదని అంటున్నాయట. దీనిపై స్వయంగా ఆమె వివరణ ఇస్తేగానీ నమ్మడానికి లేదు.