Home / SLIDER / ఏడేండ్ల నుంచి మస్తు ఓపిక పట్టినం.. ఇక తగ్గేదేలేదు

ఏడేండ్ల నుంచి మస్తు ఓపిక పట్టినం.. ఇక తగ్గేదేలేదు

విపక్షాల నాయకుల మాటలకు ఏడేండ్ల నుంచి మస్తు ఓపిక పట్టినం. ఇగ చాలు..బరాబర్ ఇకనుంచి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లే సమాధానం చెబుదాం. వెనక్కు తగ్గేదేలేదు’ అని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్.అన్నారు. జలవిహార్‎లో టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశారు.అప్పట్లో కేసీఆర్‎కు మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు‘మనందరం వివిధ పదవులలో ఉన్నామంటే దానికి కారణం పార్టీ కార్యకర్తలే. ఏప్రిల్ 27, 2001న పార్టీ ఆవిర్భవించింది. కేసీఆర్ 47 ఏళ్ల వయసులో తెలంగాణ కోసం ముందుకు వచ్చారు. అప్పట్లో ఆయనకు పాపులారిటీ లేదు. అంగ బలం లేదు, అర్ధ బలం లేదు, సినిమా గ్లామర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, మీడియా పవర్ లేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కేసీఆర్ ఒక్కడే. కానీ, ఆ ఒక్కడు ఇప్పుడు లక్షల మంది అయ్యారు. తాము ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది పదవుల కోసం కాదని.. ప్రజలలో నమ్మకం కలిగించడం కోసం ఆనాడే కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే సభ్యత్వానికి, టీడీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజకీయాలపై ప్రజలలో ఉన్న అపనమ్మకాన్ని పోగొట్టడం కోసం.. తాను ఉద్యమం నుంచి పక్కకు తప్పుకున్నా.. ఎత్తిన జెండాను కిందకు దించినా.. నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని కేసీఆర్ అనాడే చెప్పాడు. భారత చరిత్రలో ఇలా చెప్పిన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే. తెలంగాణ కోసం కాంగ్రెస్, టీడీపీలతో పొత్తు పెట్టుకొని వారిని తెలంగాణకు అనుకూలంగా మార్చారు. కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసింది. దాంతో తెలంగాణ ప్రజల సత్తా ఏంటో చూపించాలనే ఉద్దేశంతో నవంబర్ 29, 2009న కేసీఆర్ నిరాహారాదీక్షకు కూర్చున్నారు. ఆ దెబ్బతో ఉద్యోగులు, విద్యార్థులు, తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్‎కు అండగా నిలిచింది. దాంతో తప్పని పరిస్థితుల్లో కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది.

పేరుకే అవి ఢిల్లీ పార్టీలు.. చేసేవన్నీ సిల్లీ పాలిటిక్స్టీ బీజేపీ, టీ కాంగ్రెస్ నాయకులకు పదవులు ఎక్కడి నుంచి వచ్చాయి. వారి పదవులన్నీ కేసీఆర్ భిక్షే. కేసీఆర్ లేకపోతే మీ పార్టీలెక్కడివి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‎లో మిమ్మల్ని దేకినోడేవడు. గంజిలో ఈగలా ఎగిరెగిరి పడుతున్న ఆ నాయకులను ఎవరైనా పట్టించుకుంటరా? మనం, మన పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండాలని, ఏది పడితే అది మాట్లాడొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కానీ, విపక్షాల చిల్లర నాయకుల లేకి మాటలు వింటే ఒక్కోసారి ఆవేశం వస్తది. కేసీఆర్ కాలు గోరుకు సరిపోని వాళ్లందరూ

మాట్లాడుతున్నరు. తెలంగాణ ప్రజలు రెండుసార్లు సీఎంగా ఎన్నుకున్న కేసీఆర్ గురించి ఇష్టవచ్చినట్లు మాట్లాడుతున్నరు. పేరుకే అవి ఢిల్లీ పార్టీలు.. చేసేవన్నీ సిల్లీ పాలిటిక్స్. తెలంగాణ ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉంటే.. విపక్షాల కడుపు మండుతుంది. తెలంగాణలో పైరులు పచ్చబడుతుంటే.. వాళ్ల కళ్లు ఎర్రబడుతున్నాయ్. మంత్రి శ్రీనన్న ఓపిక పట్టాలంటుండు. కానీ, ఏడేండ్ల నుంచి మస్తు ఓపిక పట్టినం. ఇగ చాలు.. బరాబర్ ఇకనుంచి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లే సమాధానం చెబుదాం. వెనక్కు తగ్గేదేలేదు. ఇప్పటినుంచి కేసీఆర్ గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే.. కుక్క కాటుకు చెప్పు దెబ్బే. ఆయనను ఎవరైనా ఒక్క మాట అంటే.. మనం పది మాటలు అనాలి. ఇకనుంచి విడిచిపెట్టేది లేదు. ఊకుంటే చిల్లరగాళ్లు ఎక్కువ అయితున్నరు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పార్టీ సెక్రటరీ జనరల్ శ్రీ కేశవరావు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat