శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి 1,54,997 క్యూసెక్కుల వస్తోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు ఉండగా..ప్రస్తుత నీటిమట్టం 876.50 అడుగలకు చేరింది. ఎడమ జలవిద్యుత్ కేంద్రం నుంచి దిగువకు 34,255 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద కొనసాగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి లక్షా 54 వేల 997 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 876.50 అడుగలకు చేరింది.
గరిష్ఠ నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా… ప్రస్తుతం దాదాపు 170.664 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. అక్కడి నుంచి నాగార్జునసాగర్‌కు… 34,255 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.