బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తల్లి ఐసీయూలో ఉన్నారని తెలుస్తోంది. అక్షయ్ తల్లి అరుణా భాటియా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కారణంగా ముంబయిలోని హీరానంది ఆసుపత్రిలో చేర్చారట.
ఇటీవలే ‘సిండ్రెల్లా’ సినిమా షూటింగ్ కోసం లండన్ వెళ్లాడు అక్షయ్. అయితే తన తల్లిని ఆసుపత్రిలో చేర్చారనే విషయం తెలియగానే హుటాహుటిన బయలుదేరి, ముంబయి చేరుకున్నారు.
ప్రస్తుతం అరుణా భాటియా ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది. కాగా అక్షయ్.. రోహిత్ శెట్టి దర్శకత్వంలో నటించిన ‘సూర్యవంశీ’ విడుద’కి సిద్ధంగా ఉంది. ఇక ‘సిండ్రెల్లా’, ‘అత్రాంగి రే’, ‘రక్షా బంధన్’, ‘రామ్ సేతు’ సినిమాలలో నటిస్తున్నారు.